27, మే 2011, శుక్రవారం

కాలం - కొలమానం

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, నా జీవితంలో జరిగిన విషయాలను మీముందుంచితే, చదివే మీరు మీ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తూ విశ్లేషణ చేస్తారు. కానీ ఒక్క విషయం మనం ముందుగా తెలుసుకుని అప్పుడు ముందుకు వెళదాం. అది నేను ప్రయాణించిన కాలం అలాగే ఆకాలంలో ఉన్న సమాజ స్తితి గతులు. వాటిని మనం ప్రస్తుత కాలంలో పోల్చుకోలేము. ఏ కాలానికి సంబందించిన పరిమితులు ఆకాలనివే అని గమనిస్తే, చదివే మీరందరు ముందుగా ఆ కాలన్ని మీ మనసులో నిలుపుకుని నా పుటలను చదివే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

ప్రస్తుత విషయానికి వస్తే, ఐదు పదులు నిండి ఆరో దశకానికి దగ్గర పడుతున్న వయసులో నేను వ్రాస్తున్న ఈ బ్లాగ్రఫీని చదువుతూ నన్ను మరియు నా జివితాన్ని నాతో కలసి విశ్లేషించే ప్రయత్నంలో నాకు తోడుగా ఉన్న ఓ ఇద్దరు తెలుగు బ్లాగర్లను మెచ్చుకోకుండా ఉండలేను అలాగే వారి అనుమతి లేకుండా వారి పేర్లను ప్రస్తావించనూ లేను. వారికి తోడుగా మీరు నిశ్పక్షపాతంగా ఆలోచిస్తూ నన్ను ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను